అమరావతి : ఏపీలో అధికార తెలుగుదేశం(TDP) పార్టీకి షాక్ తగిలింది. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు కాకముందే ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు వైసీపీ(YCP) తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మదునూరి మురళీకృష్ణంరాజు(Murali Krishnamraju) గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మురళీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.