SP Vikrant Patil | అందరి సహకారంతో శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు విజయవంతంగా ముగిశాయని నంద్యాల ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. గురువారం రథోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పూజలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అందరూ సమన్వయంతో భక్తుల భద్రత, క్షేమమే లక్ష్యంగా బాగా పని చేసి విజయవంతంగా పూర్తి చేశారన్నారు. బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఆయన అభినందించారు. హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా చేశారంటూ ప్రశంసించారు.