అమరావతి : కర్నూలు(Kurnool) జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై(Minor Girl) అత్యాచారం చేసిన నిందితుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి అతడి ఇంటికి నిప్పు (Fire) అంటించారు.
మండలంలోని చెల్లెలిచెలిమా గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై నిందితుడు వేంకటేశ్వర్లు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయే యత్నం చేయగా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడు ఉంటున్న ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామందుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ బలగాలు మొహరించారు.