అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లకు (IPS) మెమోలు జారీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఏపీలో వెయిటింగ్ ఉన్న కొందరు. వెయిటింగ్లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumal rao) బుధవారం మెమోలు జారీ చేశారు. వీరిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్‌లు పలువురు ఉన్నారు.
పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్‌కుమార్ కాంతిరాణా టాటా, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, పాలరాజు, అమ్మిరెడ్డి, విజయరావు, జాషువా, కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరా రెడ్డి, కృష్ణకాంత్ పటేల్‌తో పాటు మరికొందరికి మెమోలు జారీ చేశారు. వీరంతా ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోనే ఉండాలని, విధుల ముగిశాక హాజరు పట్టికలో సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. రోజూ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు.