అమరావతి : జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు (Award winners) 174 మందిని ఎంపిక చేసింది. ఈనెల 11న మంగళగిరిలో నిర్వహించే విద్యా దినోత్సవం రోజున అవార్డు గ్రహితలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు.
పాఠశాల విద్యాశాఖ (School Education) నుంచి 77 మందికి, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 26 మందికి, డిగ్రీ లెక్చరర్లు(Degree Lecturers ) 19 మంది, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు 16 మంది, ఇంజినీరింగ్,ఫార్మసీ లెక్చరర్లు(Pharmacy Lecturers) 4గురు. విశ్వవిద్యాలయాలకు చెందిన 31 మంది ప్రొఫెసర్లకు అవార్డును ఇవ్వనున్నారు.