అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.4 లక్షల క్యూసెక్కుల నీటిని కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముంపునకు గురయ్యే సమీప తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాల ని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది .
అంబేద్కర్ కోనసీమ లంక గ్రామాల్లోకి నీరు వస్తుండడంతో గ్రామ స్థులు ఆందోళనకు గురవుతున్నారు. పి.గన్నవరం మండలం చాకలిపాలెం, కనకాయలంక తదితర గ్రామాలు ముంపునకు గురయ్యాయి.