తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యాగశాల వైదిక కార్యక్రమాలు, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేశారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 18వ తేదీ వరకు 22 మంది రుత్వికులు శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహించనున్నారు.ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈఓ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.