తిరుపతి : తిరుపతిలోని (Tirupati ) గోవిందరాజ స్వామి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI) కియోస్క్ యంత్రాన్ని (Kiosk machine) విరాళంగా అందించింది. క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్లో రూ. లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చని అధికారులు వివరించారు.
ఇప్పటికే ఎస్బీఐ 5 కియోస్క్ యంత్రాలను అందించగా, వాటిని తిరుమల, తిరుపతి, దేవుని కడపలలో టీటీడీ వినియోగిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణ రెడ్డి, ఎస్బీఐ డీజీఎం లేఖా మీనన్, ఆర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 62,223 మంది భక్తులు దర్శించుకోగా 19,704 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.10 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.