అమరావతి : ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడిన వైనం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌గా (Commissioner) పనిచేస్తున్న సర్వేశ్వరరావు నగర వాసి నుంచి సోమవారం రూ. 20 వేలు లంచం తీసుకుంటుడగా పట్టుకున్నారు.
జనన ధ్రువీకరణ పత్రం సరి చేసేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు సోమవారం వ్యూహత్మకంగా వ్యవహరించి బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం కమిషనర్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగించారు.