అమరావతి : సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మోసాలు సైతం అదేరీతిలో పెరిగిపోతున్నాయి.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు, మెసెజ్‌లకు
సమాదానం ఇవ్వవద్దని పోలీసులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. వీటిని ఖాతరు చేయని వ్యక్తులు మోసాలకు గురవుతున్నారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సైబర్‌నేరగాళ్లకు చిక్కి రూ. 7.25లక్షలు పోగొట్టుకున్నారు. పాన్ నెంబర్ అప్డేట్ కాలేదంటూ సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు లింక్ పంపారు. దీనికి స్పందించిన ఆమె లింక్ క్లిక్ చేయడంతో అకౌంట్ నుంచి మూడు విడతల్లో రూ. 7.25లక్షల మాయమయ్యాయి. అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయ్యాయని మెసేజ్ రావడంతో ఖంగుతిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.