శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న గణేశ సదనానికి భక్తులు రూ.ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చారు. హైదరాబాద్కి చెందిన సత్యనారాయణ కుటుంబీకులు దేవస్థానం ఈవో లవన్నను కలిసి చెక్కు రూపంలో విరాళాన్ని అందించారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక దర్శనాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.