అమరావతి : చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని గంగవరం మండలం కురపల్లిలో పాలవ్యాన్ను ద్విచక్రవాహనం ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పలమనేరు వాసులు నారాయణ(54), రాజేశ్(44)గా గుర్తించారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.