అమరావతి : ఏపీలోని విజయవాడ గన్నవరం(Gannavaram ) వద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అతివేగమే (Over speed) ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు సూర్యాపేట (Suryapeta ) జిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్, మతిన్గా గుర్తించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.