Road accident | పల్నాడులో ఘోరం.. ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మంటల్లో ఐదుగురు సజీవదహనం
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డ్రైవరుతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు.
Road accident : ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు డ్రైవరుతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. పల్నాడు జిల్లా చిలూకలూరిపేట మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ అయిన అరవింద ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సులో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఏపీ ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారే. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సు చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారి పాలెం – పసుమర్రు గ్రామాల మధ్యనున్న ఈవూరివారిపాలెంకు చేరుకోగానే ఎదురుగా కంకర లోడుతో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
క్షణాల్లో టిప్పర్లో మంటలు చెలరేగి వెంటనే బస్సుకు అంటుకున్నాయి. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగేలోపే దాదాపు 20 మందికి మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ సహా ఐదుగురు బస్సులోనే సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. పోలీసులు చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

