అమరావతి : తూర్పు గోదావరి ( East Godavari ) జిల్లా కొంతమూరు జాతీయ రహదారి ( National Highway) వద్త లారీ, కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. విశాఖ వైపు వస్తున్న కారు, ఏలూరు వైపు వెళ్తున్న లారీ ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. లారీ టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ను ఢీకొని అవతలివైపు ఉన్న రోడ్డులో కారుపై పడింది.
కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గాయపడ్డ మరొ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.