అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా(Palnadu district) లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ(lorry and car ) కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్(teacher) రాజ్యమ్మ,పాస్టర్ నాగినేని సురేశ్ మృతి చెందారు.
సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా జరుగగానే లారీ డ్రైవర్(lorry driver) అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.