అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీ ( Lorry) ని ఐచర్ వాహనం ఢీ కొట్టగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున అనంతపురం (Anantapuram) జిల్లా కేంద్రానికి సమీపంలో చిన్నంపల్లి క్రాస్ వద్ద రాళ్ల లోడుతో వెళుతున్న లారీ టైరు (Lorry Tyre) పంక్చర్ కావడంతో లారీని పక్కకు నిలిపారు.
అదే సమయంలో అనంతపురం నుంచి కల్యాణదుర్గం వెళుతున్న ఖాలీ ఐచర్(Eicher Vehicle) వాహనం అతి వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి (Karnataka State) చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.