అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అకాల మరణం కలచివేసింది. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ’ అని పేర్కొన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.