అమరావతి : ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరు ( Poddutur ) సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారీ (Prisoner Escapes ) కావడం సంచలనం సృష్టించింది. పలు దొంగతనాల కేసులో జైలులో ఉన్న దువ్వూరు మండలం జిల్లెలకు చెందిన అంతరాష్ట్ర దొంగ మహ్మద్ రఫీ ( Mohammed Rafi ) శనివారం ఉదయం సబ్ జైలు( Sub Jail ) నుంచి గోడ దూకి పారిపోయాడు.
ఒక చోరీ కేసులో ఈనెల 13న రఫీని అరెస్టు చేసిన రాజుపాలెం పోలీసులు నిందితుడిని ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించగా ఇవాళ ఉదయం సబ్ జైలు నుంచి గోడ దూకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ ప్రారంభించి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ ఖైదీ రఫీ పరారీ కావడం పట్ల పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.