సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
Suicide: ఫోక్సో చట్టం కింద కేసు నమోదై జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
అమరావతి : ఫోక్సో చట్టం కింద కేసు నమోదై జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. పీలేరు మండలం ఎర్రగుంపల్లి పంచాయతీ పరిధిలోని ముడుపుల వేములవారి పల్లెకు చెందిన రాజేశ్ నాయక్ (32) ఓ మైనర్‌పై అత్యాచారం చేసి గర్భవతి కారకుడయ్యాడని అతడిపై మార్చి 25న చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
ఈ రోజు తెల్లవారుజామున జైలులో రాజేశ్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన పీలేరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. రాజేష్ మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

