తిరుమతి : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా 23,127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.72 కోట్లు వచ్చిందని తెలిపారు. ఏపీ మంత్రి రాంప్రసాద్ (Minister Rampradad ) మంగళవారం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికి సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
లడ్డూ కౌంటర్లను పరిశీలించిన అదనపు ఈవో
తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌ను మంగళవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. లడ్డూ పోటు పీష్కార్ శ్రీనివాసులుతో పాటు సంబంధిత అధికారులతో కలిసి లడ్డూ కాంప్లెక్స్‌ను సందర్శించి దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకు నిల్వ ఉన్న ఉగ్రనామాన్ని సందర్శించారు.