అమరావతి : రాజకీయాల్లో ఏనాటికి మిత్రులు, శత్రువులు శాశ్వతం కారని అనేక సందర్భాల్లో నిరూపితం అయ్యాయి. తాజాగా ఒకప్పటి సినీమిత్రులు నేడు రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు పోటీకి సిద్ధమవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కల్యాణ్ పనిచేస్తుండగా, కమెడియన్‌గా రాణిస్తున్న అలీ ఏపీలో వైసీపీ తరుఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీ ఆదేశిస్తే పవన్‌కల్యాణ్‌పై పోటీ చేస్తానని అలీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.
తిరుపతి జిల్లా నగిరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబురాల్లో అలీ పాల్గొన్నారు. స్థానికులకు నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి మంత్రి రోజాతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే తాను పవన్‌పై పోటీకి సిద్ధమేనని ప్రకటించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని స్పష్టం చేశారు.
2019 ఎన్నికలకు ముందు ఏపీలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన అలీని గత అక్టోబర్‌లో సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.