Suicide Attempt | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్రిపాడు గ్రామ వాసి యాలాల శ్వేత అనే మహిళ శ్రీశైల దేవస్థానం పరిధిలో ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త శ్రీనివాసరెడ్డితో ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన శ్వేత 2024 డిసెంబర్ 31న శ్రీశైలం దేవస్థానానికి వచ్చింది. శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం సమీపంలో 11 నిద్ర మాత్రలు మింగింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు శ్రీశైలం సీఐ ప్రసాదరావుకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నానునాయక్, హోంగార్డు ప్రసాద్ అక్కడికి చేరుకుని ఆమెను దేవస్థానం దవాఖానలో చేర్చి చికిత్స అందించారు. చివరకు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించామని శ్రీశైలం సీఐ ప్రసాదరావు తెలిపారు.