AP News | ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పందించారు. అహంకారం వల్ల జగన్ ఓడిపోలేదని స్పష్టం చేశారు. ఓటమిపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.హైదరాబాద్లోని సచివాలయం వద్ద శుక్రవారం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ సంక్షేమ పథకాలను అందించారని జగన్ అన్నారు. ఎక్కడ ఏం జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలిపారు. ప్రజలందరూ వైసీపీకే ఓటు వేస్తున్నామని చెప్పారని పేర్కొన్నారు. జగన్ను అసలు ప్రజలు వద్దనుకోలేదని.. ఎక్కడో తప్పు జరిగిందని అన్నారు. ఈవీఎంల్లో ఏమైనా లోపం ఉందా అనే అనుమానం తమకు ఉందన్నారు. అహంకారం కారణంగానే జగన్ ఓడిపోయారనే ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపై తాను ఇప్పుడే స్పందించనని తెలిపారు.