అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా కె. వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీగా తనను ఎంచుకున్న సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమేనని ఆయన అన్నారు.
పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని, జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని,తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తామని నూతన డీజీపీ అన్నారు.
ఏపీలో టెక్నాలజిని గౌతమ్ సవాంగ్ పోలీసు వ్యవస్థకు సమర్ధవంతంగా అందించారన్నారు. ఆయన పనితీరు నాకు చాలా స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.