అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.మంగళ, బుధవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నా యని తెలిపింది.
రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం రాయ్పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా , తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి, పడమర గాలులు వీస్తాయని వెల్లడించింది.