అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department ) తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు పయనిస్తోందని వివరించారు. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని(Andhra Pradesh) కోస్తా (Costal), రాయలసీమ(Rayalaseema) లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందన్నారు.