కాకినాడ: జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్టియర్‌లో చేరిన విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనను బాధిత విద్యార్థి స్నేహితుడొకరు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ర్యాగింగ్ బట్టబయలైంది. క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై సీరియస్ అయిన అధికారులు 11 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.
కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం కోరలు విప్పింది. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్లు వికృత చేష్టలకు దిగి బెదరగొట్టారు. ఫస్ట్ ఇయర్ పెట్రో కెమికల్ కోర్టు చదువుతున్న విద్యార్ధి హాస్టల్లో ఓ జూనియర్ ర్యాగింగ్ వేధింపులకు గురయ్యడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థి స్నేహితుడొకరు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. ర్యాగింగ్ సమాచారాన్ని యూనివర్శిటీకి యూజీసీ తెలియజేసింది.
జేఎన్టీయూ యాంటీ ర్యాగింగ్ కమిటీ.. వెంటనే చర్చలు తీసుకుని విచారణ జరిపింది. ర్యాగింగ్ జరిగింది నిజమే అని నిర్ధారించిన కమిటీ.. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన11 మంది విద్యార్దులపై సస్పన్షన్ వేటు వేశారు. మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుంచి, 15 రోజుల పాటు క్లాస్‌ల నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయినవారిలో ఇద్దరు సెకండ్ ఇయర్ చదువుతుండగా.. మరో తొమ్మిది మంది థర్డ్ ఇయర్ విద్యార్ధులు ఉన్నారు.