R Naranayamurthy | ఏపీ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి స్పందించారు. జగన్ ప్రభుత్వం సినిమా వాళ్లు ఎవరినీ అవమానించలేదని కుండబద్ధలు కొట్టారు.
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై చిరంజీవి స్పందన 100 శాతం నిజమని ఆర్.నారాయణమూర్తి తెలిపారు. జగన్‌ను కలిసిన వాళ్లలో తాను కూడా ఉన్నానని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదని స్పష్టం చేశారు. చిరంజీవి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవమిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించారనే ప్రచారం అసత్యమని పేర్కొన్నారు.
చిరంజీవి నాకు స్వయంగా ఫోన్ చేశారు.. అది ఆయన సంస్కారమని ఆర్.నారాయణమూర్తి అన్నారు. అందరం చిరంజీవి ఇంట్లో కలిశాం. అనంతరం చిరంజీవి పరిశ్రమ పెద్దగా అప్పటి సీఎం జగన్‌తో మాట్లాడారని తెలిపారు. చిరంజీవి వల్లే ఆరోజు సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. బాలకృష్ణ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని అన్నారు.
జగన్ గవర్నమెంట్ ఎవరినీ అవమానించలేదు
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100 శాతం నిజం
ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
జగన్‌ను కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నాను
చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్ మోహన్ రెడ్డి గారిని కలసినప్పుడు ఆయన ఎంతో గౌవరం ఇచ్చారు
గత… https://t.co/HRGPoHLkdO pic.twitter.com/2YMXB3hE6D
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025
సినిమా టికెట్ ధరలను పెంచకూడదని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది సినిమా ఒక్కటే అని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలను పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడని వ్యాఖ్యానించారు.