అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) తన సభ్యత్వానికి రాజీనామా చేసి బీసీలను మోసం చేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Karumuri Venkata Nageshwar) ఆరోపించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణయ్యకు చంద్రబాబుకు అమ్ముడుపోయి బీసీలకు(BCs) అన్యాయం చేశారని విమర్శించారు.
బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ తెలంగాణ వ్యక్తి కృష్ణయ్యను పిలిచి రాజ్యసభకు అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. బీసీలకు మంచి జరుగుతుందని భావించగా అందుకు ఆయన బీసీలను వంచించారని ఆరోపించారు.
కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల్లోని బీసీలు ఎన్నటికీ క్షమించరని పేర్కొన్నారు. చంద్రబాబు వైసీపీ నాయకులను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా మారిపోయారని విమర్శించారు సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుమల లడ్డూ పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారని ఆరోపించారు.