అమరావతి : ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షపదవిపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి (Purandeshwari) పోటీగా మరికొందరు సిద్ధంగా ఉండడంతో మరోసారి ఆ పదవిపై ఆమె స్పందించారు.
ఏడాదిన్నర కాలంగా ఏపీలో (Andhra Pradesh) బీజేపీ అధ్యక్షురాలిగా (BJP Chief) పనిచేస్తున్న ఆమెకు పోటీగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ( Kirankumar reddy), విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ( MLA Sujana Chowdari ) , ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధితో పాటు మరికొందరు ఉన్నారు.
ఇటీవల జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసినా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ మరోసారి అధ్యక్ష పదవిపై స్పందించారు. అధిష్టానానికి నాపై నమ్మకం ఉంది. ఏ పదవిచ్చినా నేను తీసుకుంటా. ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. అధ్యక్ష రేసులో ఎందరైనా ఉండవచ్చు. తప్పులేదు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం టీంను ఏర్పాటు చేసి అధ్యక్షుని పేరును ఖరారు చేస్తుందని అన్నారు.
గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ సాధించడంలో పురందేశ్వరి కీలక పాత్రను పోషించారు. అటు బీజేపీ అధిష్టానాన్ని, ఇటు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి (NDA) 164 సీట్లతో ఘన విజయాన్ని సాధించింది.
వైసీపీ ( YCP ) కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. టీడీపీ (TDP) మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. జనసేన (Janasena) 21కి 21 స్థానాలు సొంతం చేసుకుంది . ఇక బీజేపీ (BJP) మొత్తం 10 చోట్ల పోటీ చేయగా 8 సీట్లలో గెలుపొందింది. ఇక 25 పార్లమెంట్ స్థానాలకు గాను కూటమి 21 స్థానాను కైవసం చేసుకుంది. పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందింది.