ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్.. ఉత్తర్వులు జారీ
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వారి ప్రొబేషన్‌ను డిక్లేర్ చేసే అధికారం...
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వారి ప్రొబేషన్‌ను డిక్లేర్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ పరీక్ష పాసైన వారికి ప్రొబేషన్‌ను ఖరారు చేయనున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కార్.. వారి జీతభత్యాలకు సంబంధించిన అంశాలను కూడా క్లియర్ చేసింది. పేస్కేలును ఫిక్స్ చేసిన దాని ప్రకారం పంచాయతీ సెక్రటరీ/వార్డు సెక్రటరీ గ్రేడ్-5 ఉద్యోగులకు బేసిక్పేగా రూ.23,120-74,770 గా ఖరారు చేశారు. మిగతా ఉద్యోగులకు రూ.22,460-72,810 గా నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కొత్త పీఆర్సీ, ఆగస్టు నుంచి కొత్త జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.ఈ బేసిక్ ప్రకారం దీనికి డీఏ, హెచ్ఆర్ఏ కలిపితే ఒక్కో ఉద్యోగి దాదాపు రూ.30 వేల వరకు జీతాలు అందుకోనున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ను డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వీరికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందేలా ఆదేశాలు ఇవ్వడం పట్ల సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

