అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు వెంకటాచలంపల్లి వద్ద అతివేగంగా వచ్చి బోల్తా పడింది.
ఇందులోని 8 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అందులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.