అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) పలువురికి గాయాలయ్యాయి. నవీన్ ట్రావెల్స్ బస్సులో 46 మంది ప్రయాణికులు భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు బయలు దేరారు. కోవూరు వద్ద డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు , డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరులోని ఆస్పత్రికి తలరించారు. రోడ్డు ప్రమాదం వల్ల ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని పులివెందుల నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్‌కు గాయాలు కాగా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.