Road Accident : ఆధ్రప్రదేశ్లో కడప జిల్లా సీకెదిన్నే మండలం గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు లారీని ఢీకొట్టింది. బస్సు బ్రేక్‌లు ఫెయిలవ్వడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో శబరిమలకు వెళ్లారు. భక్తిపారవశ్యంతో మణికంఠుడిని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా శనివారం గువ్వలచెరువు ఘాట్‌రోడ్డు వద్దకు రాగానే బస్సు బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. డ్రైవర్ బస్సును నియంత్రిచలేకపోవడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహ ఆరుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి గాయాలు అయ్యాయి? అనే వివరాలు తెలియాల్సి ఉంది.