అమరావతి : రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్రం దృష్టిని సారించి వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేంద్రాన్ని కోరారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు. న్యాయవ్యవస్థపై అధికారపక్షం దాడికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫారసు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వానికి కోర్టులో 150 కేసులకు పైగా చుక్కెదురైందని అన్నారు.కోర్టు ధిక్కరణపై 9 మంది ఐఏఎస్లకు హైకోర్టు జైలు శిక్ష విధించిందని తెలిపారు. కోర్టు ధిక్కారణ కేసులు కూడా అంతకు మించి పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడాన్ని కాగ్ తప్పు పట్టిందని రఘురామ గుర్తు చేశారు. వీటిని దృష్టిలో పెటుకుని కేంద్రం స్పందించి ఏపీలో రాష్ట్రపతి విధించాలన్నారు.