అమరావతి : అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. అభిమానుల సంఘం కోరిక మేరకు మూతపడ్డ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే అభిమానులు థియేటర్లో బాణసంచా కాల్చడంతో థియేటర్లోని సీట్లు దగ్ధమై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.