అమరావతి : పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Former MLA Pinnelli) బెయిల్ పిటిషన్లపై 18న విచారణను మాచర్ల కోర్టు (Macharla Court) వాయిదా వేసింది. పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, మరుసటి రోజు కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని (Bail petitions) పిన్నెల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరుఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్వినికుమార్ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు.
ఘటన జరిగిన తరువాత పిన్నెల్లి కొన్ని రోజులు పరారీలో ఉండడం, జైల్లో పోలీసుల విచారణకు సహకరించక పోవడంపై కూడా చర్చ జరిగింది. ఈ కేసుల్లో విచారణ ఇంకా జరగాల్సి ఉండడం వల్ల ఈనెల 18కి తీర్పు వాయిదా వేస్తు న్యాయమూర్తి శరత్ బాబు ఆదేశాలు జారీ చేశారు.