Posani Krishnamurali | చంద్రబాబుపై మరోసారి రెచ్చిపోయిన పోసాని కృష్ణమురళి .. వంగవీటి రంగా మరణంపై వ్యాఖ్యలు
Posani Krishnamurali | వైసీపీ నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డారు.
అమరావతి : వైసీపీ నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu) పై మరోసారి విరుచుకుపడ్డారు. కాపులకు పవన్‌కల్యాణ్ మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి కాపు కులస్థుల కోసమే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు.
వంగవీటి రంగా(Vangaveeti Ranga) ను చంపించింది చంద్రబాబే అని వ్యాఖ్యనించారు. ఈ విషయం రంగా తనయుడికి, ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. రంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సుమారు 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసే నాయకుడని వెల్లడించారు. కాపులకు వంగవీటి పెద్ద హీరో అని కొనియాడారు. తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం ఎన్టీఆర్(NTR) , హోం మినిస్టర్ కోడెలకు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడని, చంద్రబాబు వల్ల రంగాకు భద్రత రాలేదని ఆరోపించారు.
రంగా ఉంటే సీఎం అయిఉండేవాడని అన్నారు. కాపు కులం (Kapu Caste) నుంచి వచ్చిన పవన్‌కల్యాణ్‌పై కాపులు ఎంతో నమ్మకం పెట్టుకోగా చంద్రబాబుతో పొత్తులు కుదుర్చుకుని కాపులకు దగా చేశారని విమర్శించారు. రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడని కాపులు నమ్మారని తెలిపారు. కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్ చెబుతున్నాడని ఆరోపించారు. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్‌కి ఓటు వేయకండని పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

