అమరావతి : అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali ) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో (Subjail) ఉన్న పోసాని ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలుపడంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు పోసాని గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అతడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 2డీ ఈకో పరీక్ష అవసరమని వైద్యులు వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబునాయుడితో పాటు నారా లోకేష్, జనసేన అధినేత, పవన్ కల్యాణ్‌పై పోసాని బహిరంగంగా నానా దుర్భాషాలాడారు.
జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గత ఐదురోజుల క్రితం హైదరాబాద్‌లో పోసానిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఇరువాదనలు విన్న జడ్జి పోసాని మురళికృష్ణకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా రాజంపేట సబ్‌జైలుకు తరలించారు .