Pulivendula| ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ గూండాలు ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌తో కలిసిపోయి దొంగ ఓట్లు వేస్తున్నప్పటికీ పోలీసులు వారికే వంతపాడుతూ చోద్యం చూస్తూ ఉండిపోతున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఓటు వేసేందుకు అనుమతించడం లేదని.. తమ ఓట్లు వేరే వాళ్లు వేసేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిలో కొన్నింటిని వైసీపీ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది.
పులివెందుల మండలం కనంపల్లిలో ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి దగ్గర నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కోవడంతో తమను ఓటు వేసేందుకు వెళ్లనివ్వాలని బతిమిలాడారు. ‘ మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’ అంటూ పోలీసులను అభ్యర్థించారు. వారి కాళ్లు పట్టుకుని బతిమిలాడారు. అయినప్పటికీ పోలీసులు కనికరించకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కనంపల్లి వద్ద పోలీసులు ధర్నాకు దిగారు.
“మీ కాళ్లు పట్టుకుంటాం.. మమ్మల్ని ఓటు వేసేందుకు పంపించండి సార్“ అంటూ పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వైసీపీ ఓటర్లు. pic.twitter.com/SEmDD8P4nG
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
మా ఓటు వేసుకునే పరిస్థితి మాకు లేదని పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమ ఊరిలో టీడీపీ బయటి వ్యక్తులు 100 మంది తిష్ట వేశారని.. తమ స్లిప్ తీసుకుని తరిమివేశారని మండిపడ్డారు. ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
పులివెందుల;
మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేదు
మా ఊరుల్లో టీడీపీ బయటి వ్యక్తులు 100 మంది తిష్ట వేశారు
మా స్లిప్ తీసుకుని తరిమేశారు
ఓటు వేయకుండా వెనుతిరుగుతున్నాం
– ఓటర్లు ఆగ్రహం pic.twitter.com/2fu9oJbPLS— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
ఓటు వేద్దామని బెంగళూరు నుంచి నల్లపరెడ్డి పల్లెకు వచ్చానని.. కానీ ఈలోపే తన ఓటు ఎవరో వేసేశారని మరో మహిళా ఓటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే నారా రాజ్యాంగం నడుస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఇదంతా చూస్తుంటే పులివెందుల, ఒంటిమిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీలా లేదని.. పోలీసులు వర్సెస్ వైసీపీలా పోరు జరుగుతుందని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోరులో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని మండిపడ్డారు.
ఓట్లు వేయడానికి వెళ్తే కొడుతున్నారు
ఒంటిమిట్ట: చిన్న కొత్తపల్లిలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సమక్షంలో అనుచరుల వీరంగం..
ఓట్లు వేయడానికి వొచ్చిన వాళ్లపై దాడులు pic.twitter.com/mY9cenfvtR
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
ప్రజాస్వామ్యం ఖూనీ
నేను ఓటు వేద్దామని బెంగళూరు నుంచి వచ్చాను. నేను నల్లపరెడ్డి పల్లెకు వచ్చేలోగానే నా ఓటు ఎవరో వేసేశారట. ఇదంతా చూస్తుంటే నారా రాజ్యాంగం నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
– ఓ మహిళా ఓటర్ ఆవేదన pic.twitter.com/GdsAT5qexn— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
పులివెందుల,ఒంటిమిట్ట లలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల తీరును చూస్తుంటే టీడీపీ vs వైసీపీ మధ్య పోటిలా జరగడం లేదు..
పోలీసు vs వైసీపీ మధ్య పోరులా జరుగుతుంది..
ఈ పోరులో ప్రజాస్వామ్యం ఓడిపోయిందినీ వైసీపీ నేతలు ఆగ్రహం pic.twitter.com/TEnTGNjqJv
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025