అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నం( Visakhapatnam )లో పోలీసులు ఆంక్షలు ( Police restrictions ) విధించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుకుండా కిందిస్థాయి పోలీసు అధికారులకు నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ ( Shanka Brata Bagchi ) ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేని కార్యక్రమాల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి ఈవెంట్లు జరుపాలని నిర్ణయం తీసుకున్నా ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాలని , పరిమితికి మించి జనాలను పోగు చేయవద్దని సూచించారు.
మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నూతన సంవత్సర వేడుకలకు ముందుగా నగరంలో పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్లు నిర్వహిస్తామని సీపీ వెల్లడించారు. నగరంలో శాంతి భద్రత పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారిస్తామన్నారు. అదేవిధంగా ఈవెంట్లు జరిగే ప్రాంతాల నిర్వాహకులు పొల్యూషన్, మున్సిపల్, అగ్నిమాపక అధికారుల అనుమతులు తప్పని సరిగా ఉండేల్సిందేనని వివరించారు.