అనంతపురం: ఆదివారం అనంతపురంలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదం గురించి స్థానిక అధికారులు, బీజేపీ నేతలతో ఆరా తీసిన మోదీ.. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు వారి కుటుంబాలు ఒక్కక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని బుదగావి వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు అధికారిక ట్విటర్ హ్యాండిల్లో మోదీ తెలిపారు.