అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మారేడుమిల్లి విహార యాత్రకు కారులో వెళ్లి వస్తుండగా ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.