Vizag Beach | వైజాగ్ బీచ్ రోడ్డుకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవరం లేదు. ఓ వైపు దూసుకొచ్చే సముద్ర కెరటాలు, మరోవైపు చల్లని గాలులు, ఇంకోవైపు పర్యాటక ప్రేమికులు.. ఇలా చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా బీచ్ పరిసరాలు కనిపిస్తుంటాయి. ఎప్పుడూ సందడిగా కనిపించే బీచ్ రోడ్డుపై అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.
సముద్రంపై అలలు ఉప్పొంగుతుంటే మరోవైపు ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సముద్ర కెరటాలు, ఆకాశం కలిశాయా అన్నట్టుగా ఉన్న ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. అత్యంత అరుదుగా కనిపించే ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విశాఖ బీచ్ రోడ్డులో అరుదైన దృశ్యం
నల్ల మబ్బులు కమ్ముకోవడంతో ఒక్కసారిగా మారిన వాతావరణం
సముద్రం ఆకాశం కలిసినట్టు కనిపిస్తున్నట్టు అరుదైన దృశ్యం pic.twitter.com/76PQw5BpN4
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026