GT vs RCB : టేబుల్ టాపర్స్‌గా లీగ్ దశను ముగించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) క్వాలిఫయర్ 1లో తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో విజయంతో ఫైనల్ చేరాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తేమ ప్రభావం ఉన్నందున ఛేదనకు మొగ్గు చూపినట్టు గిల్ తెలిపాడు. ప్రస్తుతానికి వర్షం ముప్పు లేనందున పూర్తి ఓవర్ల ఆట సాధ్యమవ్వడం ఖాయం.
నేరుగా ఫైనల్ బెర్తును పట్టేసేందుకు క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ, గుజరాత్ ఢీ కొడుతున్నాయి. లీగ్ దశలో చెరొక విజయం సాధించినా.. ఈసారి గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లేది ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. అనుకున్నట్టే కోహ్లీ జతగా వెంకటేశ్ అయ్యర్ ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు.
🚨Toss update from Dharamshala 🚨@gujarat_titans won the toss and elected to bowl first against @rcbtweets
Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/oNia93E4e4
— IndianPremierLeague (@IPL) May 26, 2026
బౌలింగ్ యూనిట్లో షెపర్డ్ బదులు డఫ్ఫీ వచ్చాడు. గుజరాత్ ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ప్రధాన పేసర్లతో ఆడుతోంది. గుజరాత్ పేస్ త్రయం రబడ, సిరాజ్, ప్రసిధ్‌ను ఆర్సీబీ టాపార్డర్‌కు ఎదర్కోవడండంపైనే ఆ జట్టు భారీ స్కోర్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, భువనేశ్వర్, జాకబ్ డఫ్ఫీ, హేజిల్‌వుడ్, రసిక్దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – రొమారియో షెపర్డ్, సుయాశ్ శర్మ, కనిష్క్ చౌహన్, జోర్డన్ కాక్స్, అభినందన్ సింగ్.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), నిషాంత్ సింధు, బట్లర్(వికెట్ కీపర్), సుందర్, రషీద్ ఖాన్, హోల్డర్, ఖెజ్రోలియా, రబడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమర్ కుశగ్ర, సాయి కిశోర్.