అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
సంగం, పెన్నా బ్యారేజ్ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని మే నెలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీటిని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేరును సంగం బ్యారేజ్‌కు నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.