అమరావతి: కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్(Port Blair) పేరును శ్రీ విజయపురంగా(Sri Vijayapuram) మార్పు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వాగతించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషం కలిగించిందని ట్వీటర్లో పేర్కొన్నారు.
I wholeheartedly welcome the decision of the Central Government, under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi ji, to rename Port Blair, the capital of the Union Territory of Andaman and Nicobar Islands, as 'Sri Vijayapuram.' This is a commendable move to…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 14, 2024
వందల ఏళ్ల పాటు పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేయడం అభినందనీయమని అన్నారు. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీ విజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని కొనియాడారు. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.