అమరావతి : తమిళనాడు( Tamilnadu )లో టీవీకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన విజయ్ ( CM Vijay ) అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులు వేరని అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన జనసేన ఉద్యమి సభలో ఆయన మాట్లాడారు.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినట్లయితే ఫలితాలు మరో విధంగా ఉండేవని అనేక మంది సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.అయితే ఏపీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలుసుకోవాలని సూచించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి దెబ్బ తిన్నామని, తాను రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక ఆటుపోట్లు తట్టుకుంటేనే పార్టీని నడపగలమని పేర్కొన్నారు.
పార్టీని స్థాపించిన తొలినాళ్లలో కేవలం కొద్ది మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారని, నేడు 21 లక్షల మంది సభ్యత్వం గల పార్టీ జనసేన పార్టీకి మూలస్తంభం కార్యకర్తేలేనని అన్నారు. 2008 నాటి నుంచే పార్టీని ఎలా నడపాల్లో ప్రణాళిక వేసుకున్నానని వివరించారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.