అమరావతి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికసాయం చేసేందుకు జనసేన కౌలు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లిఖార్జున కుటుంబాన్ని పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అనంతరం లింగపాలెం మండల నుంచి చింతలపూడికి వెళ్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన వెంట నాయకులు నాదెండ్ల మనోహర్ జిల్లా నాయకులు ఉన్నారు.